Telangana CM Revanth Reddy on Caste Census : సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై కులగణన చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బీసీల రిజర్వేషన్ల పెంపుపై ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది తీర్మానం కాదని బిల్లు అని స్పష్టం చేశారు. చట్టపరంగా సాధించుకునేందుకు నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈసారి 4 ఎమ్మెల్సీ స్థానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఇచ్చామని గుర్తు చేశారు. అసెంబ్లీలో మాట్లాడారు.