Surprise Me!

రెండు కాలనీల మధ్య అడ్డుగోడ - స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి - చివరికి ఏమైందంటే?

2025-03-17 45 Dailymotion

Hydraa Demolitions In Rajendranagar : రెండు కాలనీల మధ్య ఉన్న అడ్డుగోడ వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికుల నుంచి ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ఆ గోడను కూల్చివేశారు. దీంతో హైడ్రా అధికారులకు స్థానికులు ధన్యవాదాలు తెలియజేశారు.

వివరాల్లోకి వెళితే హైదరాబాద్​ నగర శివారులోని రాజేంద్రనగర్​ నియోజకవర్గ బండ్లగూడ జాగీర్​ నగర పాలక సంస్థ పరిధిలోని శ్రీనివాస ఎంప్లాయిస్​ కాలనీ, ఫోర్ట్యూన్​ మెడోస్​ కాలనీకి మధ్య గతంలో ప్రహరీ గోడను నిర్మించారు. పక్కపక్కనే ఉన్న కాలనీలోకి వెళ్లాలంటే 3 కిలోమీటర్ల మేర దూరం పోయి తిరిగి పోవాల్సి వస్తుండటంతో కాలనీ వాసులు ఈ విషయాన్ని హైడ్రా దృష్టికి తీసుకువెళ్లారు. అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు.