ACB Case on Vidadala Rajini : జగన్ హయాంలో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ యజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల ముసుగులో బెదిరించి వారి నుంచి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి విడదల రజిని, అప్పటి గుంటూరు ఆర్‌వీఈవో, ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. లంచం తీసుకోవడం, అనుచిత లబ్ధి కలిగించడం, నేరపూరిత కుట్ర, బెదిరింపు తదితర అభియోగాలపై అవినీతి నిరోధక చట్టంలోని 7, 7ఏ, ఐపీసీలోని 384, 120బీ సెక్షన్లు వర్తింపజేస్తూ కేసు పెట్టింది.