Surprise Me!

పీ4 విధానాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

2025-03-30 4 Dailymotion

P4 Model Launch: ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా జన్మభూమి పథకానికి ప్రాణం పోసిన చంద్రబాబు, ఆ తర్వాత CM అయ్యినప్పుడల్లా ఆ పథకాన్ని కొనసాగించారు. ఈ సారీ అందుకు భిన్నంగా ఊరిలోని పేద కుటుంబాల బాగుకు మార్గదర్శి-బంగారు కుటుంబం నినాదంతో P4 విధానానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల హామీ అయిన ఈ పేదరిక నిర్మూలన లక్ష్యాన్ని ఉగాది పర్వదినమైన నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. వెలగపూడి సచివాలయం వెనుక ఇందుకు భారీ ఏర్పాట్లు చేశారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి స్వయం సహాయక సంఘాలు, విద్యార్ధులు, రైతులు, ఉపాధి కూలీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.