Chittoor Man Hulchal In Tirumala : తిరుమలలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. మతిస్థిమితం లేని వ్యక్తిని తిరుమల టోల్ గేట్ వద్ద విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అన్యమత దుస్తులు ధరించి నిబంధనలకు విరుద్ధంగా అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వీఐపీలు వెళ్లే మార్గంలో బైక్‌పై వెళ్తుండగా పట్టుకున్నారు. ముందుగా కనుమ రహదారిలో వినాయకస్వామి ఆలయం వద్ద అతడిని నిలువరించే ప్రయత్నం చేసిన టీటీడీ విజిలెన్స్ గార్డును ఢీకొని తిరుమల చేరుకున్నాడని అధికారులు తెలిపారు.