Surprise Me!

తునికాకు కోసం వెళ్లిన మహిళలు బిక్కుబిక్కుమంటూ రాత్రంతా అడవిలోనే - డ్రోన్ సాయంతో గుర్తించిన అధికారులు

2025-04-11 2 Dailymotion

Police Rescued Missing Women in Forest : తునికాకు కోసం వెళ్లిన మహిళలు అడవిలో తప్పింపోవడంతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన అధికారులు వారిని గుర్తించి కుటుంబ సభ్యలకు అప్పగించారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపిన వివరాల ప్రకారం,

నిర్మల్‌ జిల్లా మామడ మండలం కప్పన్ గ్రామానికి చెందిన కొందరు మహిళలు గ్రామ సరిహద్దుల్లో గల అటవీ ప్రాంతంలోకి గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వెళ్లారు. తునికాకు తీసుకుని ఇంటికి వెళ్దాం అనుకునే సరికి ఉన్నట్లుండి వర్షం పడింది. ఇంటికి వెళ్లిపోవాలి అన్న తొందర్లో సగం మంది దారి తప్పిపోయారు. ఇళ్లకు చేరిన మిగతా మహిళలు అటవీ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు తప్ప మిగతా అందరిని సురక్షితంగా ఇళ్లకు చేర్చారు. రాధ, లింగవ్వ, లక్ష్మి, సరోజా వీరి జాడ మాత్రం కనిపెట్టలేకపోయారు.