Minister Nimmala Ramanaidu on Irrigation Projects: వైఎస్సార్సీపీ పాలనలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను విధ్వంసం చేశారని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. వారి విధ్వంసం కారణంగా ఈ ప్రాంత ప్రజలు 50 వేల కోట్ల రూపాయలు నష్టపోయారంటే అతిశయోక్తి కాదని అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తోటపల్లి ప్రాజెక్టుల్లో రుపాయి పనులు కూడా చేయలేదని, జైకా నిధులను సైతం దారి మళ్లించారని ఆరోపించారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు, ఈ ప్రాంత ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారని తెలిపారు.