Mokila Police Arrested Lady Aghori : కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాలతో కలకలం సృష్టించిన అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌ను సైబరాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మంచిర్యాల జిల్లా కృష్ణపల్లికి చెందిన అఘోరీ అలియాస్ శ్రీనివాస్ రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ప్రొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్స్‌లో ఉండే మహిళ దగ్గర పూజలు చేయాలని చెప్పి రూ.9.80 లక్షలు వసూలు చేశారు. పూజకు మరిన్ని డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో మహిళ మోసపోయానని గ్రహించింది. దీంతో మోకిల పోలీసులకు ఫిబ్రవరిలో ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది.