Red Sandalwood Logs Seized in Vontimitta : పుష్ప సినిమాలో కథానాయకుడు ఎర్రచందనం దుంగలను వివిధ మార్గాల్లో స్మగ్లింగ్ చేస్తాడు. గుట్టుచప్పుడు కాకుండా ఎర్ర చందనం తరలించే విషయంలో మొదటగా ఒక పాల వ్యాన్‌ను ఏర్పాటు చేసి పైన పాలు పోసి కింద ఎర్ర చందనం దుంగలు పెట్టి, వెల్డింగ్ చేసి అక్రమ రవాణా చేస్తాడు. ఆ సీన్ తరహాలోనే ఓ వ్యక్తి ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పై భాగంలో కూరగాయలు పెట్టి కింద భాగంలో ఎర్రచందనం ఉంచి రవాణా చేస్తుండగా అటవీ శాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో చోటు చేసుకుంది.