AP Cabinet Meeting 2025 : పోలవరం - బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సైతం సానుకూలంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకూ లబ్ధేనన్న ముఖ్యమంత్రి కానీ వాళ్లు ప్రతికూల ధోరణితో ఉన్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఐదు జోన్లను సమాంతరంగా అభివృద్ధి చేస్తామని స్పష్టంచేశారు. రాజధానిలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం తప్పనిసరని చెప్పారు. సింగపూర్ తరహాలో అమరావతిని తీర్చిదిద్దాలని ప్రధాని సూచించిన విషయాన్ని మంత్రులకు ఆయన వివరించారు.