ఆదిలాబాద్ మున్సిపాలిటీలో నకిలీపట్టాల దందా జోరుగా సాగుతోంది. స్థిరాస్తివ్యాపారులు ఖాళీగా ఉండే స్థలాలను చూపించి వాటికి అసలైనవిగా పత్రాలను సైతం సృష్టించి లక్షలు కాజేసే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు గోడు వెల్లబోసుకుంటున్నారు. తీరా అది ప్రభుత్వ స్థలమని తెలిసి మోసపోయామంటూ లబోదిబోమంటున్నారు.