Sit Investigation On AP Liquor Scam : వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక నిందితులైన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ అధికారులు దాదాపు 10 గంటలకుపైగా విచారించారు. వైఎస్సార్సీపీ హయాంలో కుటుంబీకులు, బంధువులు, సన్నిహితులు, బినామీల పేరిట ఉన్న సంస్థలు, వ్యక్తిగత ఖాతాల్లోకి భారీగా నిధులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అవి మద్యం ముడుపుల సొమ్ము కాకపోతే మరేంటని నిలదీశారు. అదంతా కష్టార్జితం, వైట్‌మనీ అయితే ఆ లావాదేవీల రికార్డులు, పత్రాలు చూపించాలని సిట్ అధికారులు గట్టింగా ప్రశ్నించారు. నేడూ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.