Chemical Engineer Sai Kalyan Agriculture Farm : ప్రస్తుతం మొబైల్ మన జీవితాల్లో భాగమైపోయింది. కుర్రకారుకైతే అదిలేకుంటే క్షణం తోచదు. ఇంటిపైకి వెళ్లారంటే గంటల తరబడి ముచ్చట్లే. సోషల్ మీడియాలో షికార్లు సరేసరి. మరికొందరు ఫిట్నెస్ కోసం కసరత్తులు చేస్తుంటారు. వీటన్నింటికి భిన్నమంటున్నాడు ఆ యువకుడు. కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఇంటి మిద్దెనే వ్యవసాయ క్షేత్రంగా మార్చేశాడు. ఇప్పటివరకు 500 మొక్కల్ని సృష్టించి యువతకు దిక్సూచీగా మారాడు