Road Accident In Kuntloor : రంగారెడ్డి జిల్లాలోని హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధి కుంట్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న డీసీఎంను వేగంగా వచ్చిన ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాద ఘటన దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి.