Tirumala Crowd with Devotees : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల కారణంగా గత వారం రోజులుగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల క్షేత్రంలో భక్తుల తాకిడి అనూహ్యంగా పెరుగుతోంది. ఈ క్రమంలో అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండాయి.