Akkineni Nagarjuna meets CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున కలిశారు. సీఎం నివాసంలో ఆయన్ను కలిసి త్వరలో జరగనున్న తన చిన్న కుమారుడు అఖిల్ వివాహ వేడుకకు ఆహ్వానించారు. అలాగే ఆయనతో కాసేపు చర్చించారు. గతేడాది నవంబర్‌లో అక్కినేని అఖిల్ నిశ్చితార్థం జైనబ్ రవ్జీతో జరిగిన విషయం తెలిసిందే. అప్పటినుంచి వీరి పెళ్లి కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అధికారికంగా వివాహ తేదీ వెల్లడించకనప్పటికీ జూన్ 6న ఈ వేడుక జరగనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.