Family of 20 Lions Roaming in Night : గుజరాత్ భావ్నగర్లో 20 సింహాలతో కూడిన కుటుంబం కనిపించింది. ఇందులో మగ, ఆడ సింహాలతో పాటు పిల్లలు సైతం కనిపించాయి. రాత్రి సమయంలో సంచరిస్తుండగా తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను అటవీ అధికారులు సైతం ధ్రువీకరించారు.
భావ్నగర్ జిల్లాలోని పాలితానా శెత్రూంజి డ్యామ్ పరిసర ప్రాంతాల్లో సింహాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. 20 సింహాలతో కూడిన ఓ కుటుంబం ఇక్కడ ఉంటున్నట్లు తాజా గణనలో తేలింది. ఇవన్నీ గ్రామీణ ప్రాంతంలో ఆహారం కోసం సంచరిస్తుంటాయి. ఇటీవలె ఒకరోజు రాత్రి ఆహారం కోసం బయటకు రాగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మరోవైపు ఈ వీడియో వైరల్గా మారడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. 20 సింహాలతో కూడిన కుటుంబం తిరుగుతున్నట్లు ధ్రువీకరించారు. వైరల్గా మారిన వీడియో ఫేక్ కాదని, నెలన్నర క్రితం నాటిదని చెప్పారు. ఆ సింహాల బాగోగులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని, వాటిని సురక్షితంగా ఉంచుతామని తెలిపారు. సింహాలు ఎక్కడ ఉన్నాయి? ఎటు వైపు వెళ్తున్నాయి? లాంటి విషయాలను ప్రతీ క్షణం గమనిస్తూనే ఉంటున్నామని పేర్కొన్నారు.