Surprise Me!

విధ్వంసం నుంచి పునర్నిర్మాణం దిశగా రాష్ట్రం: మంత్రి నారాయణ

2025-06-23 3 Dailymotion

Minister Narayana Special Interview On Suparipalana:  సుపరిపాలనాలో తొలి అడుగు కార్యక్రమం నాయకులు, అధికారుల మధ్య సమన్వయం మరింత పెంచేందుకు దోహదపడుతుందని మంత్రి నారాయణ తెలిపారు. ఏడాది పాలనపై సమీక్ష, రెండో ఏడాది లక్ష్యాలకు సంబంధించి జరగనున్న కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి నారాయణ స్వయంగా పరిశీలించారు. గత పాలకులు చేసిన విధ్వంస నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మాణ దిశగా తీసుకువెళ్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. 

ఈ కార్యక్రమం ఈ నెల 12వ తేదీన జరగాలి కానీ అహ్మదాబాద్​లో జరిగిన విమాన ప్రమాదం వల్ల దీనిని పోస్ట్​పోన్ చేయడం జరిగిందని మంత్రి నారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర అధికారులు పాల్గొంటారని తెలిపారు. గత ప్రభుత్వం తలకుమించిన అప్పులు చేసిందని కానీ సీఎం చంద్రబాబు ఆయనకున్న అనుభవంతో రాష్ట్రాన్ని గాడిలో పెట్టారని తెలిపారు. అలానే రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని సీఎం చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్నారని ఇంక ఈ క్రమంలో రాబోయే నాలుగేళ్లలో ఏం చేయాలనేని ఈ కార్యక్రమంలో దిశానిర్ధేశం చేస్తారని మంత్రి నారాయణ తెలిపారు.