కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్ ప్రతీ ఇంట్లోనూ ఉంటున్నాయి. చాలామంది వీటిని తమ చదువులకూ, కెరీర్ కీ ప్రయోజనకరంగా ఉపయోగించుకుంటూ ఉంటే కొంతమంది.. ముఖ్యంగా స్కూల్, కాలేజ్ స్టూడెంట్లు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలోనూ, ఇతర ఆన్ లైన్ ఎంటర్ టైన్ మెంట్, టైమ్ పాస్ సైట్లలోనూ గంటల తరబడి స్పెండ్ చేస్తూ ఇంటర్నెట్ బానిసలుగా మారుతున్నారు. ఈ నేపధ్యంలో రోజు మొత్తంపై కొంత సమయం మాత్రమే పిల్లలకు నెట్ అందుబాటులో ఉండేలా, అదీ ఆది, సోమ, మంగళ.. వంటి అన్ని వారాల్లో ఏయే గంటల్లో నెట్ వారికి పనిచేయాలీ, ఎప్పుడు పనిచేయకూడదూ అన్నది స్పష్టంగా సెట్ చేసుకుని పిల్లలు నెట్ ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవడం ఎలాగన్నది ఈ క్రింది వీడియోలో వివరిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ nallamothusridhar editor computerera telugu magazine